Home  »  TV News  »  Illu illalu pillalu : నగల గొడవతో రచ్చరచ్చ.. శ్రీవల్లి కాపురంలో సుకన్య చిచ్చు పెడుతుందా?

Updated : May 9, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -467 లో..... ధీరజ్ గురించి భద్రవతి వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే ప్రేమ తట్టుకోలేక నిజం చెప్పాలని అనుకుంటుంది. అసలు మీకు ధీరజ్ గొప్పతనం గురించి ఏం తెలుసు.. ఏ పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకున్నాడో తెలుసా అని ప్రేమ చెప్పబోతుంటే.. ధీరజ్ ఆపుతాడు. ఈ నగల గురించే కదా ఇన్ని గొడవలు మీ నగలు మీరు తీసుకోండి అని ప్రేమ తన నగలు భద్రవతి ముందు విసిరేస్తుంది. ఈ నగలు ఇచ్చింది నువ్వు ఎప్పుడు నగలతో కళకళలాడుతూ ఉండాలని.... కానీ నువ్వు పెళ్లి చేసుకున్న వాడు ఇంకా వాడి తండ్రి చవట దద్దమ్మలు అని భద్రవతి అంటుంది.

 

రామరాజు కోపంగా లోపలికి వెళ్తాడు. నాన్న తను ఏదో తెలియక చేసిందని ధీరజ్ అంటాడు. ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. సారీరా నువ్వు ఇబ్బంది పడుతున్నావని అలా చేసానని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ తనపై కోప్పడకుండా ఆ నగలు ప్రేమ మెడలో వేస్తాడు. ఇంకొకసారి నాకు ఏ విషయం చెప్పకుండా దాచోద్దని ప్రేమగా చెప్తాడు. ధీరజ్ చూడు.. భార్య తప్పు చేస్తే ఇంకొకసారి అలా చెయ్యొద్దని ఎంత ప్రేమగా చెప్తున్నాడో అని సాగర్ తో నర్మద అంటుంది. పెళ్ళాం తప్పు చేస్తే ఎంత ప్రేమగా వెనకేసుకొస్తున్నాడు.. నా మొగుడు ఉన్నాడు ఎందుకని వల్లి అనుకుంటుంది. ప్రేమ తను ఏ పరిస్థితులలో పెళ్లి చేసుకున్నానో చెప్పాలని అనుకుంటుంది. అప్పుడు నర్మద అడ్డుపడుతుంది. అంటే నిన్ను ధీరజ్ లేపుకుని  వెళ్లి పెళ్లి చేసుకున్నాడా అంటే అమూల్యని విశ్వ తీసుకొని వెళ్లినట్లుగానా..... విశ్వ, అమూల్యలకి హెల్ప్ చేసింది నువ్వేనట కదా అని సుకన్య అనగానే.. నువ్వు ఇలాంటి విషయాల గురించి పట్టించుకోకు అని నర్మద తనకి వార్నింగ్ ఇస్తుంది.

నేను చెప్తానులే చెల్లి.. తనకి తెలియదు కదా అని వల్లి పక్కకి తీసుకొని వెళ్లి ఈ విషయాలు అన్ని ఎవరు చెప్పారని వల్లి అడుగుతుంది. భాగ్యం అత్త అని సుకన్య అనగానే అందరికి నేనే వాళ్ళకి హెల్ప్ చేసానని తెలిసిపోయింది. నువ్వు సైలెంట్ గా ఉండకపోతే నా కాపురం కూలిపోతుందని వల్లి అంటుంది. ఆ తర్వాత చందు వచ్చి ఆవిడ ఎవరు అని అడుగుతాడు. మా మేనమామ కూతురు అని వల్లి చెప్తుంది. వాళ్ళ అమ్మనాన్న మంచి వాళ్ళు కదా.. నువ్వు అయిన తనకి మంచి మాటలు చెప్పమని సుకన్యతో చందు చెప్తాడు. అప్పుడే తిరుపతి వచ్చి చందు, శ్రీవల్లిని పంపించి సుకన్యతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.